మొదలైన పవన్ – త్రివిక్రమ్ సినిమా

మొదలైన పవన్ – త్రివిక్రమ్ సినిమా

Published on Jan 23, 2013 3:52 PM IST

pawan-kalyan-trivikram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా ఈ రోజు నుంచి మొదలైంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో షూటింగ్ జరుగుతోంది, అలాగే టీం మెంబర్స్ అంతా కూడా లాంగ్ షెడ్యూల్ కోసం సిద్దమవుతున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

పవన్ సరసన మొదటిసారి సమంత జోడీ కడుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో పవన్ యూత్ ఫుల్ న్యూ లుక్ తో కనిపించనున్నారు, ‘జల్సా’ తర్వాత పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు