పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో రానున్న సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమాని ఆగష్టు 7న రిలీజ్ చెయ్యడానికి చెయ్యనున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ పి.ఆర్.ఓ తెలిపారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి ‘అత్తారింటికి దారేది’ మరియు ‘సరదా’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘జల్సా’ తర్వాత పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మంచి కామెడీతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంచనా వేస్తున్నారు.