పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా కొద్దిరోజులు అక్కడే షూటింగ్ జరుపుకునే అవకాశం వుంది. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ యూరోప్ లో నిర్వహించనున్నారని సమాచారం. సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ స్టైల్, కామెడీ, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండనున్నాయి. నదియా, బోమన్ ఇరానీలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఒక మిస్టరీగా మారింది. ఈ విషయం పై ప్రొడక్షన్ టీం నుండి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఫిల్మ్ చాంబర్ లో ‘అత్తారింటికి దారేది’ అనే పేరు రిజిస్టర్ చేశారని సమాచారం.