ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘దేవరాయ’ చిత్ర ఆడియో వేడుక నిన్నరాత్రి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ శ్రీకాంత్ గారు మంచి నటుడు మాత్రమే కాదు ఏదైనా సాయం చెయ్యాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళలో ఆయన ముందు ఉంటాడు. అలాంటి శ్రీకాంత్ అంటే అన్నయ్యకి కూడా అంటే చాలా ఇష్టం , ఎంత ఇష్టం అంటే మా ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ హాజరైన శ్రీకాంత్ ని నా మరో తమ్ముడని నాకు పరిచయం చేసారు. అందువల్ల ఆయన నన్ను పిలవగానే ఇది మా ఇంట్లో ఫంక్షన్ అనుకోని వచ్చాను. ‘దేవరాయ’ ట్రైలర్ చూసాను చాలా బాగుందని’ ఆయన ఆన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ వస్తారో? రారో? అన్న అనుమానాన్ని మదిలో పెట్టుకోని పవన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన్ని కలిసి ఆడియో ఫంక్షన్ కి రమ్మని ఆహ్వానించాను. ఆయన సింపుల్ గా వస్తాను అన్నారు. ఆయన పని ఆయన చూసుకుంటూ నలుగురికి మంచి చేసే మనస్తత్వం గల ఆయన ఈ వేడుకకి వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకున్తున్నానని’ ఆయన అన్నారు. మీనాక్షి దీక్షిత్ మరియు విదిశ కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి నానికృష్ణ దర్శకత్వం వహించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జక్కంశెట్టి మరియు నానికృష్ణ సంయుక్తంగా నిర్మించారు.