పవన్ కళ్యాణ్ కి సినిమా షూటింగ్స్ నుండి బ్రేక్ దొరికింది. కొరోనా వైరస్ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ నిలిపివేయడంతో ఆయనకు కొంచెం విశ్రాంతి దొరికింది. ఐతే చిత్రాలు షూటింగ్స్ పాల్గొనకపోవడంతో ఆయన మళ్ళీ రాజకీయాలలో బిజీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు ఓ పక్క షూటింగ్స్ లో పాల్గొంటూ మరో ప్రక్క రాజకీయ వ్యవహారాలలో గడపాల్సివచ్చేది. ప్రస్తుతం ఆయన ధ్యాస మొత్తం రాజకీయాల వైపు మళ్లించారు. ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ మన నుడి-మన నది కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇక పవన్ మొత్తం మూడు సినిమాలకు కమిట్ కావడం జరిగింది. అందులో శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సైతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక హరీష్ శంకర్ తో చేయాల్సిన మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.