అన్నపూర్ణ స్టూడియోలో స్టెప్పులేస్తున్న పవన్

అన్నపూర్ణ స్టూడియోలో స్టెప్పులేస్తున్న పవన్

Published on Jul 24, 2012 11:49 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటిస్తున్న చిత్రం ” కెమెరామెన్ గంగతో రాంబాబు”. పవన్ కళ్యాణ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఎకర్స్ కాంప్లెక్స్ లో ఈ చిత్రంలోని ఒక పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాదులోని వేరు వేరు స్టూడియోల్లో మార్చి మార్చి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ ల గత చిత్రాలు భారీ విజయం సాదించడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. అలాగే గతంలో పూరి – పవన్ కలయికలో వచ్చి విజయం సాదించిన ‘బద్రి’ లాగే ఈ చిత్రం కూడా విజయం సాదిస్తుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.

తాజా వార్తలు