పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాల్లో క్రిష్ చిత్రం కూడా ఉంది. ఒకవైపు ‘పింక్’ రీమేక్ చేస్తూనే మరోవైపు క్రిష్ చిత్రాన్ని కూడా చేస్తున్నారు పవన్. ఈ చిత్రంపై ఇప్పటికే రకరకాల కథనాలు వినిపించాయి. ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని,ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. తాజాగా షూట్ లొకేషన్ నుండి పవన్ పిక్ ఒకటి లీకైంది.
చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘వకీల్ సాబ్’ షూటింగ్ నుండి పవన్ ఫోటో ఒకటి లీకైన సంగతి తెలిసిందే. ఆ ఫోటో అభిమానులకి తెగ నచ్చేసింది. దీంతో మేకర్స్ దాన్నే టైటిల్ పోస్టర్లో పెట్టేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో క్రిష్ సినిమా లీక్డ్ పిక్ దుమారం రేపుతోంది. మొదటిసారి పవన్ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ యేడాది ఆఖరులో విడుదలకానుంది.