టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన పవన్ బ్లాక్ బస్టర్ స్పీచ్

Jana-Sena-Party-launch--(26

పవన్ కళ్యాన్ ప్రారంభించిన ‘జన సేన’ పార్టీ ఆవిర్భవ సభలో పవన్ ప్రసంగం అభిమానులను ఉర్రూతలు ఊగించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. నిన్న జరిగిన ఈ సభలో గతకొంతకాలంగా మీడియా రాస్తున్న వివిధ కధనాలకు ముగింపు పలుకుతూ తాను పార్టీ పెట్టనున్నట్లు తెలిపాడు

అసలంటూ మాట్లాడని పవన్ లో నిన్న మనం హృదయమంతా నిండిన నవ్వును చూసాం, దుష్ట రాజకీయాలపై కోపాన్ని చూసాం, అవినీతి రాజకీయనాయకుల పై ఆవేశాన్ని చూసాం, అన్నయ్యకు ఎదురు నిలబడ్డానన్న బాధను చూసాం

తన స్పీచ్ ను అద్బుతంగా మొదలుపెట్టి, మధ్యలో అప్పుడప్పుడు పక్కదారి పట్టినా చివరకు తను చెప్పాలనుకున్నది ముక్కు సూటిగా పవన్ చెప్పేసాడు. అవును పవన్ కాంగ్రెస్ కు ఫుల్ యాంటి అని తేలిపోయింది. “అన్ని పార్టీలు మీలో కలిసిపోవడానికి కాంగ్రెస్ ఏమన్నా గంగా నదా??” అన్న వాక్యంలో పవన్ పవర్ తో పాటు త్రివిక్రమ్ పెన్ను పవర్ కూడా కనిపించింది. తన జన సేన ఎజెండాని, తన ఆశయాలను బయటపెట్టాడు పవన్. అన్నయ్యకు ఎదురు నిలవడం లేదని, అవినీతి వ్యవస్థకు ఎదురు వెళ్తున్నా అని తెలిపాడు. కే.సి. ఆర్ పై, రాహుల్ గాంధి పై లెక్కలేనన్ని పంచ్ లు విసిరాడు

కాంగ్రెస్ తో తప్ప ఎవరితోనైనా కలవడానికి సిద్ధమని, చంద్ర బాబు నాయుడు చాలా మంచి వ్యక్తి అని తెలిపాడు. ఈ పార్టీ పెట్టడానికి తన వెనుక నిలబడిన ఏకైక వ్యక్తి తన మిత్రుడు రాజు రవితేజ అని చెప్పుకున్నాడు. పదవి అన్నది తనకు తుచ్చమైనది అని, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని చెప్పుకొచ్చాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇప్పుడు జన సేనగా మారిందని ఇది మన సేన అని కాంగ్రెస్ హటావో దేశ్ బచావో.. జై హింద్ అంటూ ముగించాడు

Exit mobile version