పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాడబ్బింగ్ కార్యక్రమాలు మొదలైయ్యాయి. దీనికి సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఈ కార్యక్రమం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంతలు హీరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టులో విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా షూటింగ్ ని మూడు వారాలు యూరప్ లో నిర్వహించడానికి ఈ సినిమా యూనిట్ సభ్యులు వెళ్లనున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, నందితలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.