ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న తాత్కాలిక టైటిల్ ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ రైల్వే స్టేషన్ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ కి పీటర్ హెయిన్ కొరియోగ్రాఫర్ పని చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత, ప్రణితలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు వున్నాయి. ఈ సినిమాని 2013 సెకండ్ హాఫ్ లో విడుదల చేసే అవకాశం వుంది.