పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చాలా పిట్ నెస్ తో ఉంటాడు. అలాగే తన బాడి పై చాలా శ్రద్ధ తీసుకుంటాడు. తనకి మార్షల్ ఆర్ట్స్, ఏరోబిక్స్ లు తెలుసు. ప్రస్తుతం పవన్ కాస్త స్లిమ్ గాకనిపించడానికి కష్టపడుతున్నట్టున్నారు. బెంగుళూరు న్యూస్ పేపర్స్ వారు పవన్ కళ్యాణ్ పైలేట్స్ సెంటర్ వద్ద ఉన్న ఫోటో ఒకదానిని పోస్ట్ చేశారు. ఆ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తోంది. కండలు పెంచడానికి, మాములుగా బాడి బ్యాలెన్స్ గా ఉంచుకునే విషయంలో పైలేట్స్ సెంటర్ కి మంచి పేరుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా వున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో బాడీని పెంచి మనందరిని ఆశ్చర్యపరచనున్నడా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మరి కొంత కాలం వేచిచూడాల్సిందే. కానీ ఈ విషయం మాత్రం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.