మాంచి హై మూమెంట్ తో ‘ఓజి’ కి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్న పవర్ స్టార్!

మాంచి హై మూమెంట్ తో ‘ఓజి’ కి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్న పవర్ స్టార్!

Published on Jun 5, 2025 9:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఓజి” పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓజి సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుగుతుండగా పవన్ చాలా కాలం తర్వాత మళ్ళీ షూట్ లో పాల్గొన్నారు.

అయితే ముంబై, హైదరాబాద్ ఇంకా ఏపీలో కూడా షూటింగ్ కి నిర్విరామంగా వెళుతున్న పవన్ ఇప్పుడు తన పోర్షన్స్ ని కంప్లీట్ చేసేయనున్నట్టు తెలుస్తుంది. సాలిడ్ హై మూమెంట్స్ సీక్వెన్స్ తో పవన్ తన పార్ట్ వరకు షూటింగ్ ని ఈ వారాంతానికి ముగించేయనున్నారట. దీనితో ఓజి పార్ట్ 1 షూటింగ్ ఫినిష్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు