‘వకీల్ సాబ్’ కోసం పవన్ కళ్యాణ్.. ?

ఈ కరోనా మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తయ్యేది. కానీ లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ ముగియగానే షూట్ తిరిగి మొదలుపెట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటుంది. ఇప్పటివరకు పూరైన చిత్రాన్ని ఎడిటింగ్ చేస్తున్నారట. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం తన ఇంట్లోనే పవన్ ఈ సినిమా కోసం డబ్బింగ్ కూడా చెప్పనున్నారని తెలుస్తోంది.

మొత్తానికి చిత్ర బృందం వీలైనంతవరకు రిలీజ్ డేట్ ఎక్కువ రోజులు వాయిదా పడకుండా ఉండేలా చూస్తున్నారు. మొదట మే 15న ఆ తరువాత మళ్లీ జూన్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. పవన్ రీఎంట్రీ సినిమాని ఎప్పుడెప్పుడూ చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం సినిమా వాయిదా అనేది బాగా నిరాశ పరిచేదే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version