పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్.!

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్.!

Published on Mar 5, 2013 8:20 AM IST

pawan-kalyan-trivikram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మేము ఇదివరకు చెప్పినట్లే ఈ మూవీకి ప్రస్తుతానికి ‘సరదా’ అనే టైటిల్ పెట్టి షూటింగ్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సారి పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2013 సెకండాఫ్ లో రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు