టి.వి ఇంటర్వ్యూ ఇవ్వనున్న పవన్ కళ్యాన్

Pawan-Kalyan

ప్రస్తుత తరం తెలుగు నటులలో తనకంటూ ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న నటుడు పవన్ కళ్యాన్. తన తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది’ సినిమా అఖండ విజయంతో ఆయనకు ఫాలోయింగ్ మరింత పెరిగింది. పవన్ పరిచయస్తులతో తప్ప మిగతా వారితో మాట్లాడాడని, తన సినిమాలకు సంబంధించిన ఎంటువంటి ప్రచార కార్యక్రమాలలో అంత త్వరగా పల్గోడని మనకు తెలుసు.

కాకపోతే ఎన్నో ప్రతికూల పరిస్థుతల నడుమ విడుదలైన ఈ సినిమాను ఇంతలా ఆదరించిన కృతజ్ఞతతో ఒక వీడియో ఇంటర్వ్యూ ఇవ్వనున్నాడు. ఈ ఇంటర్వ్యూ తరువాత న్యూస్ చానళ్లలో, వెబ్ సైట్ లలో పెట్టనున్నారు. గతంలో ‘పంజా’ చిత్రంకు గానూ సుమ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. మరి ఈ సారి ఎవరు చేస్తారో వేచి చూడాలి. అంతేకాక ఈ సినిమా విజయానికి సంబంధించిన థాంక్స్ గివింగ్ పార్టీకు కుడా సరైన తేదిని ఎంచుకోనున్నారు. త్వరలో ఈ తేదిని అధికారికంగా తెలపనున్నారు

Exit mobile version