మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం కానున్న సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా ‘రేయ్’. ఈ మూవీ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నాడు. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమం జనవరి 5న జరగనుంది. వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్దా దాస్ లు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాని నార్త్ అమెరికాలోని అందమైన లోకేషన్స్ లో షూట్ చేసారు. ‘రేయ్’ సినిమా ఫిబ్రవరి 5న రిలీజ్ కానుంది. మాములుగానే వైవిఎస్ చౌదరి ఈ సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. అదే ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ వస్తే సినిమాకి ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది.