Operation Sindoor: సెలబ్రెటీస్ కి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఈ ఉదయంతోనే దేశ వ్యాప్తంగా భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసిన వార్తలతో ఒక శుభ ఉదయం అందరికీ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై అనేకమంది సినీ, రాజకీయ సహా క్రికెట్ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

అయితే ఈ ఆపరేషన్ సిందూర్ విషయంలో టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సమయంలో ఎవరైనా సరే దేశానికి విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసినా అలాగే మాట్లాడినా కూడా ఎలాంటి సందేహం లేకుండా కేసులు బుక్ చేయడం జరుగుతుంది అని చెప్పేసారు.

అంతే కాకుండా మెయిన్ గా సెలబ్రెటీస్, ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నారో వారికి కూడా మరీ మరీ చెబుతున్నాను ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు కోసం కనీసం అవగాహన లేకుండా మాట్లాడొద్దు అని అలా మాట్లాడితే మీకే నష్టం అనేలా పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇపుడు సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో కూడా వైరల్ గా మారింది.

Exit mobile version