పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’గా వెండితెరపై అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించారు. హైందవ ధర్మం కోసం పిడికిలి బిగించి, ఔరంగజేబ్ అహంకారానికి సవాల్ విసిరి శత్రువులను నేలరాల్చిన వీరుడు హరిహర వీరమల్లుగా పవన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు.
వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం ప్రేక్షకులని, అభిమానులని ఆకట్టుకుంది. ఇక పవన్ స్వయంగా కంపోజ్ చేసిన యాక్షన్ సీన్‌లు సినిమాకి మేజర్ హైలెట్ గా నిలిచాయి.
సనాతన ధర్మ రక్షణ నేపథ్యాన్ని సినిమాలో చాలా గొప్పగా చిత్రీకరించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లోని ఈ ఎపిసోడ్లు ప్రేక్షకుల్ని అద్భుతంగా ఆకట్టుకున్నాయి. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ధర్మపోరాటం అభిమానులకి కనుల పండువగా నిలిచింది.