యూరోప్ లో పవన్ – త్రివిక్రమ్ ల సినిమా

Pawan-and-trivikram

పవన్ కళ్యాణ్ ”అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ యూరోప్ లో జరుపుకోవడానికి సర్వం సిద్ధమైంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. పవన్ కళ్యాన్ సరసన సమంత నటిస్తుంది. ప్రణీత సుభాష్ రెండో హీరొయిన్. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్లో ముఖ్యమైన షెడ్యూల్ ముగించుకుని రెండు పాటల చిత్రీకరణకై బృందం మొత్తం స్పెయిన్ మరియు యూరోప్ లో కొన్ని దేశాలకు వెళ్తున్నారు. పోయిన యేడు ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పాట చిత్రీకరణకొరకు స్విట్జర్ల్యాండ్ వెళ్ళిన పవన్ ఇప్పుడు మరోసారి యూరోప్ వెళ్తున్నాడు. ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విధానంపై బృందం ఆనందం వ్యక్తం చేసింది. త్రివిక్రమ్ మరోసారి తన పంచ్ లైన్లతో ఈ ఫ్యామిలీ డ్రామాను తీర్చిదిద్దుతున్నాడు. నదియా మరియు బోమన్ ఇరానీ ముఖ్య పాత్రధారులు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ యేడు రెండో భాగంలో విడుదలకానుంది.

Exit mobile version