మరోసారి డాన్సులతో ఫాన్స్ ని మంత్రముగ్ధుల్ని చెయ్యనున్న పవన్ కళ్యాణ్

Pawan-Kalyan

త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త లుక్ పై ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమాలో చాలా యంగ్ గా ఫీట్ గా కనబడి మనకు ఒక కొత్త పవన్ కళ్యాణ్ ని తెరపై చూపిస్తాడట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో హీరో హీరొయిన్ల మధ్య ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట ఫాన్స్ కు కనుల పండగగా నిలుస్తుందట. ‘గబ్బర్ సింగ్’తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన పవర్ స్టార్ ఈ ఏడాది ‘అత్తారింటికి దారేది'(చాలా వరకూ) సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. బి.వి.ఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణీత సుబాష్ హీరొయిన్స్. నదియా మరియు బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఒక కొత్త షెడ్యూల్ కు గానూ చిత్ర బృందమంతా త్వరలో యూరోప్ వెళ్లనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version