పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తు్న్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా, ఈ చిత్రం హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్ర సాంగ్స్‌పై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు.
అయితే, ఈ మూవీలోని మూడో పాటగా ‘అసుర హననం’ అనే పవర్ఫుల్ సాంగ్‌ను మే 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో కీరవాణి దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్లడం.. ‘అసుర హననం’ పాటకు సంబంధించి వారు చర్చించడం.. ఇప్పటికే తాను ఈ పాటను 50 సార్లు విన్నట్లుగా పవన్ తెలపడం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది.
మొత్తానికి పవర్ఫుల్ మ్యూజిక్‌తో ఈ పాట కంపోజిషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్ విలన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.