ఓజీ సీక్వెల్‌పై పవన్ ఏమన్నాడంటే..?

ఓజీ సీక్వెల్‌పై పవన్ ఏమన్నాడంటే..?

Published on Oct 2, 2025 9:02 AM IST

OG Movie

“ఓజీ” బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో పవన్ కల్యాణ్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కటానా పట్టుకోవడం, వర్షంలో ఇబ్బందులు గుర్తుచేసుకుంటూ నవ్వించారు. అలాగే, సక్సెస్ ఈవెంట్‌లో గన్ పట్టుకుని రావాలని టీమ్ చెప్పడంతో “గన్ అంటే నా వీక్‌నెస్” అంటూ సరదాగా మాట్లాడారు. వేదికపై ఆయన గన్ పట్టుకోవడం అభిమానులను ఆకట్టుకుంది.

దర్శకుడు సుజీత్‌ను ప్రశంసించిన పవన్, “అతనికి గొప్ప విజువల్ సెన్స్ ఉంది. మరోసారి ఆయనతో పని చేయాలని అనిపించింది. సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తానని మాటిచ్చాను” అన్నారు. ఇక ఈ మాటలతో పవన్ నుంచి మరో సినిమాను అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు