‘ఓజి’ ఊచకోత.. ఆల్ టైం రికార్డుతో మొత్తం షేక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక్క సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తన అవైటెడ్ చిత్రం “ఓజి” చూపిస్తుంది. ఎప్పుడు నుంచో భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకి రిలీజ్ కి దగ్గరకి వస్తుండగా ఈ గ్యాప్ లో మేకర్స్ ఫస్ట్ సాంగ్ ని విడుదల చేశారు. మరి ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ ని టాలీవుడ్ లో కొల్లగొట్టింది. ఒక్క మాటలో ఊచకోత రెస్పాన్స్ తో దుమ్ము లేపింది.

మన టాలీవుడ్ లోనే ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ అందుకున్న సాంగ్ గా ఇప్పుడు బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసింది. ఇది కూడా 24 గంటలు పూర్తి కాకుండానే.. ఈ లెక్కన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత పిచ్చిగా వెయిట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version