యూఎస్ మార్కెట్ లో ‘ఓజి’ రికార్డు ప్రీసేల్స్.. 1 మిలియన్ కి చేరువలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెద్క్ సినిమా “ఓజి” రిలీజ్ దగ్గరకి వస్తున్న నేపథ్యంలో అంచనాలు అలా పెరుగుతూ వెళ్లిపోతున్నాయి. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అంతే ఎగ్జైట్ అయ్యే విధంగా యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ రికార్డులు సెట్ చేస్తున్నాయి.

మరి ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 23 రోజులు సమయం ఉన్నప్పటికీ అప్పుడే 1 మిలియన్ డాలర్ గ్రాస్ దగ్గరకి వచ్చేసింది. ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కేవలం ప్రీసేల్స్ తోనే 9 లక్షల డాలర్స్ మార్క్ అందుకుంది. దీనితో ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమా కూడా అందుకోని ఫాస్టెస్ట్ రికార్డు ఈ సినిమా అందుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఇక రిలీజ్ దగ్గరకి వచ్చేసరికి ఓజి ఏ నెంబర్ దగ్గర ఆగుతుందో చూడాల్సిందే.

Exit mobile version