‘ఓజి’: మైండ్ బ్లాకింగ్ బిజినెస్.. పవర్ స్టార్ అసలు స్టామినా!

‘ఓజి’: మైండ్ బ్లాకింగ్ బిజినెస్.. పవర్ స్టార్ అసలు స్టామినా!

Published on Jul 12, 2025 2:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదరణ కానీ మార్కెట్ కోసం కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన రీజనల్, రీమేక్ సినిమాలే రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని అందుకుంటాయి. ఇక అలాంటిది తన నుంచి స్ట్రైట్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అంతకు మించి తన మనసుకు దగ్గరైన సినిమాలు వస్తే వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇపుడు “ఓజి” చూపిస్తుంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న ఈ భారీ సినిమా బిజినెస్ లెక్కలు మైండ్ బ్లాకింగ్ గా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలలో ఊహించని నంబర్స్ తో వ్యాపారం జరుగుతుండగా ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఏకంగా 300 కోట్లకి పైగా జరుగుతుంది అన్నట్టుగా టాక్.

ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఆసక్తి కనబరుస్తున్నారట. ఇలా మొత్తానికి పవర్ స్టార్ కి సరైన సినిమా పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఈ హైప్ లో ఓపెనింగ్స్ కూడా ఊహించని లెవెల్లోనే ఉంటాయని ట్రేడ్ సర్కిల్స్ ఆల్రెడీ చర్చ నడుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు