చివరి దశలో పవన్ కళ్యాణ్ మూవీ

Power-Star-Pawan-Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ యూరప్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియా చేరుకుంది. యూరప్ షెడ్యూల్ తో దాదాపు 90% షూటింగ్ పూర్తయ్యింది. ఇంకా 5 రోజుల టాకీ పార్ట్ మరియు ఓ సాంగ్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఈ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. దీనితో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆగష్టు మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. మొదటి సారిగా పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version