పవన్, మహేష్ లు సెలబ్రిటీలు అని ప్రకటించిన ఫోబ్స్

పవన్, మహేష్ లు సెలబ్రిటీలు అని ప్రకటించిన ఫోబ్స్

Published on Dec 13, 2013 8:30 PM IST

Mahesh-Babu-and-PawanKalyan
పవన్ కళ్యాణ్ ది ఇప్పుడు పాపులారిటీ అవసరం లేని పేరు. ప్రస్తుతం ఫోబ్స్ 100 సెలబ్రిటీల జాబితాలో పవన్ తన పేరును లిఖించుకున్నాడు. ఒక సర్వే 2013 ఫోబ్స్ సెలబ్రిటీల జాబితాలో 26వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ జాబితాలో చోటుకోసం అభిమానాన్ని, సంపాదనను లెక్కలోకి తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ మినహా మహేష్ బాబు (54), నాగార్జున(61), రవితేజ(68), రామ్ చరణ్(69) వ స్థానాలలో మన టాలీవుడ్ హీరోలు స్థానాన్ని సంపాదించుకున్నారు. పాపులారిటీయే కాక రెమ్యునరేషన్, ఇతర సంపాదన ఆదాయాలు, ప్రచార చిత్రాలను దృష్టిలో పెట్టుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ ఏడాది ఒక్క సినిమాలో కారణాన ఈ జాబాతాలో చోటు సంపాదించలేకపోయారు.

బాలీవుడ్ నటులు, క్రికెట్ క్రీడాకారులతో నిండిపోయిన ఈ జాబితాలో టాలీవుడ్ హీరోయిన్లలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం బాధాకరం

తాజా వార్తలు