నితిన్-నిత్య మీనన్ జంటగా విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఇష్క్’ చిత్ర ఆడియో వేడుక ఈ రోజు రాక్ గార్డెన్స్ లో జరిగంది. ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిదిగా విచ్చేసారు.
మొదటి పాటను దర్శకురాలు నందిని రెడ్డి విడుదల చేసి, నేను డైరెక్ట్ చేసిన ‘అలా మొదలైంది’ సినిమాలో నిత్య మీనన్ ఈ ‘ఇష్క్’ సినిమాలో ఉన్నంత అందంగా లేదు అని ఫీలవుతున్నాను. ఒక్కటే తేడా ఏంటంటే పిసి శ్రీరామ్ గారు నిత్యని అంత బాగా చూపించారు. దిల్ రాజు మాట్లాడుతూ నితిన్ మా బ్యానర్లో ‘దిల్’ సినిమా చేసాడు. దిల్, ఖుషి స్థాయిలో ఇష్క్ కూడా పెద్ద హిట్ కవలను కోరుకుంటున్నారు. ఈ చిత్ర హీరో నితిన్ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికీ తెల్సిందే.
నా సినిమా ఆడియో ఫంక్షన్ కి నా ఫేవరేట్ హీరో రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ కి రాలేదు. నితిన్ అంటే నాకు బాగా ఇష్టం. నితిన్ రమ్మని అడగగానే రావాలనిపించింది. ఈ ఆడియో వేడుక ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆడియో ఆడియో ఆవిష్కరించి మొదటి సీడీని పిసి శ్రీరామ్ కి మొదటి సీడీ అందించారు. ఈ వేడుకకి పవన్ కళ్యాణ్, నితిన్, పిసి శ్రీరామ్, దిల్ రాజు, కరుణాకరణ్, నందిని రెడ్డి, విక్రమ్ కె కుమార్, గణేష్ బాబు విచ్చేసి సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు.