నైజాంలో ‘వీరమల్లు’ ప్రీమియర్స్ సస్పెన్స్!

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన అవైటెడ్ పీరియాడిక్ హిస్టారికల్ చిత్రమే “హరి హర వీరమల్లు”. చివరి నిమిషంలో ఊహించని ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ ప్రీమియర్స్ ని కూడా సెట్ చేసుకుంది. అయితే హరిహర వీరమల్లు తెలుగు స్టేట్స్ లో ఒక రోజు ముందే పైడ్ ప్రీమియర్స్ కి సిద్ధం అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే.

కానీ ఏపీలో ఎప్పుడో మొదలైన ప్రీమియర్స్ బుకింగ్స్ నైజాం మార్కెట్ లో షోస్ ఇవాళే అయినప్పటికీ మొదలు కాలేదు. ఆల్రెడీ ఇక్కడ పర్మిషన్ అండ్ హైక్స్ కూడా వచ్చినప్పటికీ మొదలు కాకపోవడం అనేది అభిమానుల్లో ఒకింత టెన్షన్ గా కూడా మారింది. మరి ఈ బుకింగ్స్ ఎప్పుడు ఉంటాయో చూడాలి.

Exit mobile version