పవన్ కు కాంగ్రెస్ నుండి ఆహ్వానం

Pawan-Kalyan
పవన్ రాజకీయ ప్రవేశపు వార్త బయటకు రాగానే పెద్ద పార్టీలన్నిటి నుండి ఆయనకు ఆహ్వానపత్రికలు అందాయి. ఇటీవలే లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ పవన్ కు ఇష్టమైతే తనపార్టీ లో చేరవచ్చని తెలిపారు.. సామాచారం ప్రకారం మరికొన్ని పార్టీలు పవన్ ని సంప్రదించాయట

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే పవన్ ను కాంగ్రెస్ తన పార్టీలోకి ఆహ్వానించింది. కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రకారం “పవన్ కాంగ్రెస్ లోకి వస్తే మాకు చాలా ఆనందం. పవన్ ఇంకా తన ప్లాన్ల గురించి మాట్లాడక పోయినా ప్రతీ పార్టీ ఆయననను తమకే కావాలని కోరుకుంటుంది” అని అన్నారు

పవన్ ఈనెల 14న హైటెక్స్ లో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ని వివరించనున్నాడు. మరి ఆ మీటింగ్ లో ఏం చెప్తాడో అతనికే తెలియాలి

Exit mobile version