ఎట్టకేలకు అత్తారింటికి దారేది సినిమాను చుసిన పవన్

pawan_kalyan
పవన్ అభిమానులకు ‘అత్తారింటికి దారేది’ సినిమా రూపంలో ఒక గొప్ప బహుమతి లభించింది. రెట్టించిన ఆనందంతో ఈ సినిమాను పదేపదే చూస్తూ కలెక్షన్లను తదేకంగా పెంచేస్తున్నారు. సినిమా పూర్తయిన తరువాత ఇంక ఆ సినిమా గురించి పట్టించుకోని పవన్ ఎట్టకేలకు ‘అత్తారింటికి దారేది’ సినిమాను ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చూసాడు. పవన్ తో పాటూ ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ కుడా కలిసి చూసారు. చాలాకాలం విరామం తరువాత తమ అభిమాన నటుడు సినిమా విడుదలయ్యాక ఇంటర్వ్యూ ఇవ్వడం అభిమానులకు పండుగనే చెప్పాలి. ఎప్పుడూ లేనివిధంగా పవన్ ”అత్తారింటికి దారేది” థాంక్స్ గివింగ్ మీట్ లో 30నిముషాలు మాట్లాడటం విశేషం.

సమంత, ప్రణీత హీరోయిన్స్ గా కనిపించిన ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

Exit mobile version