‘వీరమల్లు’ కోసం పవన్ రెడీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ మరికొన్ని రోజులు మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంది. అయితే, ఆయన రాజకీయంగా బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.

కాగా, ఇప్పుడు ఈ సినిమాను పూర్తి చేసేందుకు పవన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ కోసం పవన్ కాల్షీట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మే నెలలో పవన్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటాడని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు మరోసారి ‘హరిహర వీరమల్లు’ హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ డియోల్, నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version