సాయి ధరమ్ తేజ్ కు అండగా పవన్ కళ్యాణ్

pawan-sai-dharam-tej

చిరంజీవి మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ తెరారంగ్రేటం వై.వి.ఎస్ చౌదర ‘రేయ్’ రూపంలో రాబోతుంది. నటన పై తనకున్న తపనను చూపించి ఇప్పటికే మన మెగా హీరో అందరినీ మెప్పించాడు. సమాచారం ప్రకారం ఈ సినిమాలో నృత్య రీతులతో కొత్త హీరో మనల్ని అలరించనున్నాడు. చాలా రోజులుగా నిర్మాణ దశలో వున్న ఈ సినిమా ఎట్టకేలకు అతి త్వరలో మనముందుకు రానుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ రానున్నాడు. ఈ సినిమా ఆడియో డిసెంబర్ మొదటి వారంలో మెగా కుటుంబంలో పలు హీరోల సమక్షంలో ఘనంగా విడుదలచెయ్యనున్నారు. పవన్ చివరిసారిగా ‘నాయక్’ ఆడియో కి వచ్చాడు. మరోసారి ఈ సినిమాకు రానున్నాడు.

సాయి ధరమ్ తేజ్ తో సయామీ ఖేర్, శ్రద్ధా దాస్ స్క్రీన్ ను పంచుకుంటున్నారు. కరేబియన్ దీవుల, అమెరికా అందాలు నడుమ సినిమాను తీశాడు. చక్రి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది

Exit mobile version