సమాజానికి మంచి మాత్రమే చేసే అనుచరులు దొరికేంత వరకూ తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోనని పవన్ కళ్యాణ్ నిన్న ధృవీకరించాడు. ఈ స్టేట్మెంట్ నిన్న వైజాగ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో వెల్లడించాడు. పవన్ తన పార్టీ సిద్ధాంతాలకోసం పెట్టిన ఈ మీటింగ్ కు వేల కొద్దీ ప్రజలు హాజరయ్యారు
“నేను నా సిద్ధాంతాలకోసం ఊపిరి వదలడానికి కూడా సిద్ధమే. నేను నమ్మిన వ్యక్తులు దొరికే వరకూ నేను ఎన్నికలలో నిలబడను. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులకోసం నేను ఎదురుచూస్తున్నా. వారు మీలోనే వున్నారు. మీరు నమ్మినవారికే ఈసారి వోటు వేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు 150సంవత్సరాల చరిత్ర వుందని చెప్పుకుంటుంది.. కానీ గత కొన్నాళ్లుగా వారు చేసింది ఏమిటి?? ప్రతీ 5 సంవత్సరాలకు సిద్ధాంతాలను మార్చుకుంటూ రావడం తప్ప” అని ప్రసంగించాడు
ఈ నెల మొదట్లో పవన్ నరేంద్ర మోడిని కలిసి బి.జె.పి కి మద్దతు ఇస్తానన్న విషయం తెలిసినదే. నిన్న వైజాగ్ స్పీచ్ లో పవన్ మరోసారి “మన తెలుగువారంతా కలిస్తే కాంగ్రెస్ ను తరిమికొట్టచ్చు” అని నినాదమిచ్చాడు