కరోనా మహమ్మారి పై యుద్ధంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను బాగానే అప్రమత్తం చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలనూ ఒప్పుకుంటన్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలోనే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన ఇంకొన్ని చిత్రాలకు సైన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’, క్రిష్ చిత్రాల చేస్తోన్న పవన్, లాక్ డౌన్ తరువాత ఈ చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసి ఆ వెంటనే హరీష్ శంకర్ సినిమాను కూడా స్టార్ట్ చేస్తాడట. ఆ తరువాత డైరెక్టర్ డాలీతో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్.
మొత్తానికి నాలుగు సినిమాలతో బిజీగా ఉండనున్నారు. కరోనా తగ్గాక పవన్ క్రిష్ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. క్రిష్ తో చేస్తోన్న ఈ సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.