‘విరూపాక్ష’ టీమ్ కి పవన్ నుండి క్లారిటీ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా తగ్గేవరకూ సినిమాల షూటింగ్ కి దూరంగా ఉండటమే మంచిదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తోన్న సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నారని.. ఈ ఏడాది చివరి వరకూ తన పార్ట్ కు సంబంధించి ఎలాంటి షూట్ ను ప్లాన్ చెయ్యొద్దు అని పవన్ కళ్యాణ్ చిత్రబృందానికి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏప్రిల్ సెకెండ్ వీక్ లో కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ షెడ్యూల్ కరోనా తగ్గిన తరువాతే స్టార్ట్ చేయనున్నారు.

అన్నట్టు ఈ సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కరోనా పై యుద్ధంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి నుండి తన అభిమానులను అప్రమత్తం చేస్తున్నారు. ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలనూ పవన్ ఒప్పుకుంటన్న సంగతి తెలిసిందే.

Exit mobile version