పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం “వకీల్ సాబ్” అనే చిత్రం ద్వారా గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈపాటికే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణం చేత ఆగిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ మధ్య పవన్ ఫ్యాన్స్ మీడియాలో రచ్చ చేసి పారేస్తున్నారు.పవన్ కు అడ్వాన్స్ బర్త్ డే గిఫ్ట్ గా ఏకంగా 2 కోట్ల 70 లక్షల ట్వీట్స్ తో నేషనల్ రికార్డునే నెలకొల్పారు.
దీనితో ఇక రాబోయే “వకీల్ సాబ్” టీజర్ కు కూడా అంతే స్థాయి భారీ రెస్పాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ 1 మిలియన్ లైక్స్ అందుకున్నవి లేవు. మన స్టార్ హీరోలు అందరికీ స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ ఎవరూ అందుకోకపోవడంతో మన టాలీవుడ్ లో ఈ రికార్డ్ అందని ద్రాక్ష గానే నిలిచింది. దీనితో ఇప్పుడు ఈ రికార్డును పవన్ ఫ్యాన్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ వచ్చే సెప్టెంబర్ 2 పవన్ సందర్భంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ ఫస్ట్ ఎవర్ రికార్డును పవన్ ఫ్యాన్స్ అందుకుంటారో లేదో చూడాలి.