కన్ఫామ్ కాని సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆరాటం.!

కన్ఫామ్ కాని సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆరాటం.!

Published on Jul 22, 2020 7:08 PM IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అధికారికంగా అయితే మొత్తం మూడు సినిమాలను కమిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటిది శ్రీరాం వేణు దర్శకత్వంలో పింక్ రీమేక్ “వకీల్ సాబ్” కాగా మిగతా రెండు ఒకటి విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడితో చేస్తున్న పీరియాడిక్ డ్రామా మరోటి తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒకటి. అయితే ఇప్పుడు వీటన్నిటి కంటే మరో సినిమా అంటే పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

లేటెస్ట్ గా పవన్ తన ముప్పైవ చిత్రం దర్శకుడు సుకుమార్ తో చేయనున్నారు అని ప్రచారం మొదలు కావడంతో పవన్ ఫ్యాన్స్ లో ఈ అంశం పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం రానప్పటికీ పవన్ ఫ్యాన్స్ మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. దీనితో వారిలో వారే అనవసరమైన అంచనాలు పెట్టుకోవద్దని అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాలని సర్ది చెప్పుకుంటుంన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఒకే అవుతుందో లేదో చూడాలి.

తాజా వార్తలు