టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న సమంత కి మంచి గోల్డెన్ హార్ట్ కూడా ఉంది. దానికి సాక్ష్యమే ఆమె ‘ప్రత్యూష ఫౌండేషన్’ పేరుతో ఓ చారిటీ షో నడుపుతోంది.
సమంత మాట్లాడుతూ ‘ మాదొక మధ్య తరగతి కుటుంబం. అప్పట్లో నేను ఎవరన్నా వచ్చి సహాయం చేస్తే ఎంత బాగుంటుందో అనుకునే దాన్ని, ఇప్పుడు నేను బాగా సెటిల్ అయ్యాను. బాగా సంపాదిస్తున్నాను. నాకు కార్లు ఇల్లు ఉన్నాయి చాలు అంతకన్నా మించి ఉన్న డబ్బుని ఎం చేసుకుంటాం. అందుకే ప్రత్యూష ఫౌండేషన్ కి అండగా నిలిచి నా వంతు సహాయం నేను చేస్తున్నానని’ చెప్పింది.
అలాగే చెబుతూ ‘పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకి నేను ఈ చారిటీ గురించి చెప్పగానే చాలా ఆనందించారు. వెంటనే వారు వాడిన కాస్ట్యూమ్స్ ని మాకు ఇసమ్స్థకి ఇవ్వడానికి సిద్దమయ్యారు. పవన్ గారు గబ్బర్ సింగ్ డ్రెస్ ఇస్తే, మహేష్ బాబు లండన్ లో ఉన్నప్పటికీ ‘దూకుడు సినిమాలో తను వాడిన కాస్ట్యూమ్స్ ని నాకు అందేలా చేసారు. నాకు చాలా హప్ప్య్గా ఎందుకనిపించింది. చెప్పాలంటే ఇప్పటి వరకు నాతోటి పనిచేసే హీరోయిన్స్ కూడా ఎవ్వరూ సాయమందించలేదని’ చెప్పింది.