మోహన్ బాబు మంచు, విష్ణు మంచు, మంచు మనోజ్ హీరోలుగా నిర్మిస్తున్న మంచు వారి మల్టీ స్టార్రర్ మూవీ ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఈ సినిమా ఆడియో లాంచ్ శనివారం రోజు హైదరాబాద్ లో చాలా ఘనంగా జరిగింది. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని విష్ణు మంచు, మనోజ్ మంచు కలిసి జంటగా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకు దాసరి నారాయణ రావు, కె. రాఘవేంద్రరావు, ప్రణిత సుభాష్, బ్రహ్మానందం, వీరుపొట్ల, బీ.గోపాల్, కోన వెంకట్, బీవీఎస్ రవి, గోపీమోహన్ మొదలగు అతిధులు హాజరైయ్యారు.
ఈ వేడుకలో దాసరి నారాయణ రావు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు మోహన్ బాబు ‘పాండవులు పాండవులు తుమ్మెద’ అనే పేరు పెట్టడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ పేరు వింటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకి మంచు విష్ణు, మనోజ్ లు మంచి స్క్రిప్ట్ ను ఎన్నుకున్నారు. అలాగే మంచి పెర్ఫామెన్స్ ను అందిస్తున్నారు. నేను కచ్చితంగా చెబుతున్నాను ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదిస్తుంది’. అని అన్నాడు. ఆ తరువాత ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ను విడుదల చేశారు. మనోజ్ అక్కడికి లేడీ గెటప్ లో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ ‘ అందరూ నన్ను ఈ గెటప్ ఈ సినిమాలో వుందా అని అడుగుతున్నారు. నేను ఈ గెటప్ వేయడానికి స్పూర్తి నర్తనశాలలో ఎన్ టి ఆర్ గారు వేసిన బృహన్నల పాత్ర. మిగతా విషయాలు తెలియాలంటే ఈ సినిమాలో చూడండి ‘ అని అన్నాడు.
ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో రవీన టాండన్, హన్సిక, ప్రణిత సుభాష్, వరుణ్ సందేశ్, తనిష్, వెన్నెల కిషోర్ మొదలగు వారు నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 31 విడుదలయ్యే అవకాశం ఉంది.
ఘనంగా జరిగిన ‘పాండవులు పాండవులు తుమ్మెద ఆడియో లాంచ్
ఘనంగా జరిగిన ‘పాండవులు పాండవులు తుమ్మెద ఆడియో లాంచ్
Published on Jan 12, 2014 2:45 AM IST
సంబంధిత సమాచారం
- తమ్ముడు.. ఓజీ ట్రైలర్ అదిరింది..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం భారీ చిత్రంతో పాటు క్రేజీ కంటెంట్ ఇదే !
- చిరు@47.. ఎమోషనల్ నోట్తో అన్నయ్య ప్రస్థానాన్ని గుర్తుచేసిన పవన్ కళ్యాణ్
- సెన్సార్ పనులు పూర్తి చేసిన ‘కాంతార : చాప్టర్ 1’.. రన్టైమ్ ఎంతంటే..?
- ఏపీలో ప్రీమియర్స్ ఫిక్స్.. ఊచకోతకు ఓజీ సిద్ధం..!
- ఇదంతా మీ అందరివీ, మీరందించినవి – మెగాస్టార్
- పోల్ : ఓజీ – కాంతార చాప్టర్ 1 ట్రైలర్లలో మీకు ఏది నచ్చింది?
- ‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్టైమ్ కూడా లాక్..!
- 10 రోజుల్లో ‘మిరాయ్’ వసూళ్లు ఎంతంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ
- ‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?
- వీడియో : ‘కాంతార చాప్టర్ 1 ట్రైలర్ (రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్)
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !
- వీడియో : దే కాల్ హిమ్ ఓజి – ట్రైలర్ (పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి)