మంచు ఫ్యామిలీ హీరోలైన డా. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’. జనవరి 31న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు కొన్ని చిన్న చిన్న కట్స్ విధించి ఈ మూవీకి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు.
డా. మోహన్ బాబు ఈ సినిమా తనకి అసలైన రీ ఎంట్రీ మూవీ అవుతుందని, అలాగే ఈ సినిమాలో తను చెప్పిన పంచ్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలో మంచు హీరోలతో పాటు వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ లు కుడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీ వాస్ డైరెక్టర్. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై డా. మోహన్ బాబు – మంచు విష్ణు కలిసి ఈ సినిమాని నిర్మించారు.