విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా కుటుంబం అంతా కూర్చుని చూసేలా తెరకెక్కిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై, అన్ని ఎరియాల్లోనూ సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అవడంతో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకని గ్రాండ్ గా చేయనున్నారు. ఈ వేడుక జనవరి 20వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ వేడుకకి సినిమాలో నటించిన అందరు నటీనటులు, టెక్నీషియన్స్ వచ్చే అవకాశం ఉంది.
దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. సమంత, అంజలి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు.