‘పైసా’, ‘ఖడ్గం’ అంత గొప్ప సినిమా అవుతుంది – నాని

nani
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని ఆ తర్వాత హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నాని నిర్మాతగా మారి నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టాడు. నాని నిర్మాతగా మారి చేసిన సినిమా ‘డీ ఫర్ దోపిడీ’. ఈ సినిమాకి నానితో పాటు రాజ్, డికే లు కూడా నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుండడంతో నాని ప్రమోషన్స్ బాగా చేస్తున్నాడు. ఇది కాకుండా నాని హీరోగా నటించిన పైసా సినిమా త్వరలో విడుదల కానుంది.

పైసా సినిమా రిలీజ్ వివరాలను అడిగితే నాని సమాధానమిస్తూ ‘ పైసా త్వరలోనే విడుదలవుతుంది. ఈ మూవీ విషయంలో ఒక్కటి మాత్రం చెప్పగలను. ఎప్పుడు విడుదలైనా మంచి విజయాన్ని అందుకుంటుంది. నేను కృష్ణ వంశీ గారి అభిమాని అయినప్పటికీ పైసా షూటింగ్ టైంలో చాలా విషయాల్లో ఆయనతో వాదన పెట్టుకున్నాను. కానీ పూర్తి సినిమా చూసిన తర్వాతే కృష్ణవంశీ గారంటే ఏంటో తెలిసింది. కృష్ణ వంశీ గారి కెరీర్లో ‘ఖడ్గం’ ఎంత గొప్ప సినిమానో ‘పైసా’ కూడా అంత గొప్ప సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలని’ అన్నాడు.

Exit mobile version