ఓటిటి సమీక్ష: ‘పడక్కలం’ – తెలుగు డబ్ మళయాళ సినిమా జియో హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష: ‘పడక్కలం’ – తెలుగు డబ్ మళయాళ సినిమా జియో హాట్ స్టార్ లో

Published on Jun 10, 2025 10:46 PM IST

padakkalam

విడుదల తేదీ : జూన్ 10, 2025
స్ట్రీమింగ్‌ వేదిక :జియో హాట్ స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్, సాఫ్, అరుణ్ ప్రదీప్, అరుణ్ అజికుమార్, నిరంజన అనూప్, పూజా మోహన్‌రాజ్, మరియు ఇషాన్ షౌకత్
దర్శకుడు : మను స్వరాజ్
నిర్మాతలు : విజయ్ బాబు – విజయ్ సుబ్రమణ్యం
సంగీతం : రాజేష్ మురుగేషన్
సినిమాటోగ్రఫీ : అను మూతేదథ్
ఎడిటర్ : నిధిన్ రాజ్ అరోల్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

లేటెస్ట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన చిత్రాల్లో గత మే నెలలో మలయాళంలో రిలీజ్ అయ్యిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ చిత్రం “పడక్కలం” కూడా ఒకటి. మరి తెలుగు డబ్బింగ్ లో కూడా జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

పూర్వ కాలానికి చెందిన ఆదిత్య మహారాజు ఒక ప్రత్యేక వస్తువుని తయారు చేయించుకుంటాడు. ఎన్నో మహిమలు కలిగిన ఆ వస్తువు అప్పటి కాలం నుంచి ఇప్పుడు కాలానికి చేరుకుంటుంది. అలా ఒక కాలేజ్ ప్రొఫెసర్ రంజిత్ (షరఫ్ యు దీన్) ఆ వస్తువుతో కొన్ని విచిత్రమైన శక్తులు కలిగి ఉంటాడు. అయితే తాను పని చేస్తున్న అదే కాలేజ్ లో మరో ప్రొఫిసర్ సాజీ (సూరజ్ వెంజరమూడు) కి తనకి పడకపోవడంతో తన శక్తులు వాడి అతన్ని ఇబ్బంది పెడతాడు. దీనిని అదే కాలేజ్ స్టూడెంట్ జితిన్ (సందీప్ ప్రదీప్) సీక్రెట్ గా చూసేస్తాడు. మరి అక్కడ నుంచి ఈ కథ ఎలా మలుపు తిరిగింది. ఈ ముగ్గురు ఒకరి ఆత్మ మరొకరిలోకి ఎలా ప్రవేశించింది? చివరికి ఎవరికి వాళ్ళు మళ్ళీ తన దేహాల్లోకి వెళ్లగలిగారా? అందుకు వారు ఆడాల్సిన ఆట ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమాని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

మొదటిగా ఈ సినిమాలో కాన్సెప్ట్ ఒకింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పాలి. మంచి ఫాంటసీ ఇంకా సూపర్ నాచురల్ థ్రిల్లర్ లాంటి సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా లైన్ మరింత ఆసక్తి కలిగించవచ్చు. ఇక ఇందుకు తగ్గట్టుగానే ఫస్టాఫ్ లో నడిచే కథనం ఒకింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

దీనితో పాటుగా కాలేజ్ ఎపిసోడ్స్ కూడా సినిమాలో బాగున్నాయి. నలుగురు ఫ్రెండ్స్ నడుమ కెమిస్ట్రీ అందులో ఒక ఫ్రెండ్ కి సమస్య వస్తే కలిసి నిలబడడం అందులో అక్కడక్కడా జెనరేట్ అయ్యే ఫన్ నవ్వు తెప్పిస్తుంది. ఇక దీనితో పాటుగా ముగ్గురు లీడ్ నటులు సందీప్ ప్రదీప్, సూరజ్ వెంజరమూడు ఇంకా షరఫ్ లు మంచి నటన కనబరిచారు అని చెప్పాలి.

ముఖ్యంగా ఒకరో పాత్ర నుంచి మరొకరి లోకి వెళ్ళినపుడు చూపించిన వేరియేషన్స్ ముగ్గురు నటులు కూడా అదరగొట్టారు అని చెప్పాలి. అలాగే వీరిలో నటుడు సూరజ్, షరఫ్ లపై కనిపించే ఎమోషనల్, ఇతర కారణాలు అర్ధవంతంగా ఉంటాయి. ఇక వీరితో పాటుగా హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు, ఫీమేల్ లీడ్ నిరంజన అనూప్ చూసేందుకు అభినయలా అనిపిస్తుంది కానీ తన రోల్ బానే చేసింది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ మొదట్లో చెప్పిన వస్తువుగా మారేదన్నా దర్శకుడు డిజైన్ చేసుకోవాల్సింది. ఒక వస్తువు అని చెప్పి హాలీవుడ్ సినిమా జుమాంజీ సినిమా తరహా బోర్డు పెట్టి కథనం నడిపించారు.

సినిమాలో సెల్ఫ్ సెటైర్ కూడా దీనిపై ఉంది కానీ ఇంకొంచెం కొత్తగా దీనిని ట్రై చేయాల్సింది. అలాగే ఫస్టాఫ్ వరకు కథనం ఓకే కానీ సెకండాఫ్ లో మాత్రం కథనం అంత ఎంగేజింగ్ గా సాగలేదు. అలా సోసో గా వెళుతుంది కానీ మరీ అంత ఎంటర్టైనింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ సాగదు.

అలాగే పాత్రలు మారడం మూలాన ఒక సాధారణ ఆడియెన్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక వీటితో పాటుగా కథనం చాలా వరకు ఊహించదగిన రేంజ్ లోనే కొనసాగుతుంది. సో ఈ సూపర్ నాచురల్ ఫన్ డ్రామా అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా మంచి సెటప్, ఆర్ట్ వర్క్ చేశారు. రాజేష్ మురిగేషన్ ఇచ్చిన సంగీతం బాగుంది. మెయిన్ గా ఫస్టాఫ్ లో కొన్ని ట్రాక్స్ మంచి ట్రెండీగా అందించారు. అను మూతెడథ్ ఇచ్చిన కెమెరా వర్క్ కూడా బాగుంది. సినిమా మూడ్ ని, ఆ అట్మాస్పియర్ ని బాగా చూపించారు. నిధిన్ రాజ్ ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది.

ఇక దర్శకుడు మను స్వరజ్ విషయానికి వస్తే.. తాను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని పట్టుకొని కామెడీ మిక్స్ చేసి ట్రై చేద్దాం అనుకున్నారు. అయితే ఇది ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్కౌట్ కాలేదని చెప్పక తప్పదు. ఫస్టాఫ్ వరకు బాగానే సాగిన ఈ సినిమా సెకండాఫ్ లో అంతే ఎంగేజింగ్ గా నడిపించలేకపోయారు. క్లైమాక్స్ ముందు వరకు అలా సోసో గా ఒకింత డల్ గానే సినిమా అనిపిస్తుంది. ఇంకా బెటర్ గా సీన్స్ ని డిజైన్ చేసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘పడక్కలం’ సినిమాలో ఒక ఆసక్తికర కాన్సెప్ట్ నే కనిపిస్తుంది. అలాగే మెయిన్ లీడ్ నటులు చాలా మంచి నటనను అందించారు. ఇంకా కొన్ని చోట్ల మంచి ఫన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కానీ ఈ కాన్సెప్ట్ ని ఇంకా ఎంగేజింగ్ గా దర్శకుడు నడిపించాల్సింది. మరింత ఫన్, థ్రిల్ మూమెంట్స్ ని జోడించి ఉంటే ఈ సూపర్ నాచురల్ సినిమా మరింత ఎంటర్టైన్ చేసి ఉండేది. సో ఈ సినిమాని మీరు మరీ మళయాళ సినిమా లవర్స్ అయితే చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు