ఆది, శన్వి జంటగా నటిస్తున్న ప్యార్ మైన్ పడిపోయా సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ఈ చిత్రం టాకీ భాగంపూర్తయిపోయింది. కేవలం పాటల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. రవికుమార్ చావాలి ఈ సినిమ . రాధామోహన్ నిర్మాత
ప్రస్తుతం హీరో హీరోయిన్లపై రామోజీ ఫిలిం సిటీలో ఒక రొమాంటిక్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. మార్చ్ 3నుండి నానాక్రామ్ గూడలో వున్నా రామానాయుడు స్టూడియోలో ఆదిపై టైటిల్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటలతో సినిమా మొత్తం పుర్తవనుందని ఆది తెలిపాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఆది వాయిద్యకారుడిగా కనిపించనున్నాడు.అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రాఫర్