“వకీల్ సాబ్”కు అవుట్ స్టాండింగ్ గా.!


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్” పై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఈపాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యిపోయింది. పవన్ నటిస్తున్న ఈ చిత్రానికి దాదాపు అంతా పవన్ తో వర్క్ చేస్తున్న వారే అని చెప్పాలి. దర్శకుడు శ్రీరామ్ వేణు, అలాగే సంగీత దర్శకుడు థమన్ అలాగే నిర్మాత దిల్ రాజులు మొదటిసారి పవన్ తో వర్క్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి సంబంధించి ప్రతీ అంశాన్ని స్పెషల్ గా టేకప్ చేస్తున్నారు.

ముఖ్యంగా సంగీతం విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారని చెప్పాలి. “మగువా మగువా” సాంగ్ నుంచి లేటెస్ట్ టీజర్ లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు థమన్ చాలా ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా ఆల్బమ్ ను కూడా అవుట్ స్టాంగింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించని థమన్ అంటుంన్నాడు. దీనిని బట్టి “వకీల్ సాబ్”తో పవన్ కెరీర్ లో మరో మంచి ఆల్బమ్ రావడం ఖాయం అని చెప్పాలి.

Exit mobile version