తుఫాన్ సృష్టిస్తున్న తుఫాన్ ఫస్ట్ లుక్

తుఫాన్ సృష్టిస్తున్న తుఫాన్ ఫస్ట్ లుక్

Published on Apr 2, 2013 12:30 AM IST

Thoofan
మెగా అభిమానులు ప్రస్తుతం ఆకాశవీధిలో విహరిస్తున్నారు. ఒక అగ్ర కధానాయకుడుని అగ్రకధానాయకుడిగా నిలబెట్టిన చిత్రాన్ని రీమేక్ చేయడంతో రామ్ చరణ్ హిందీ చిత్ర సీమలో అడుగుపెడతున్నాడు అని తెలియగానే అభిమానులు ఒకింత కంగారుపడ్డారు . కానీ మన అంచనాలని తారుమారు చేస్తూ మెగాస్టార్ చిరు చేతుల మీదగా ఈ రోజు విడుదలయిన తుఫాన్(‘జంజీర్’ తెలుగు వెర్షన్) అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో చరణ్ రిస్కీ స్టంట్లు, పవర్ ఫుల్ పోలీస్ గెటప్ తో, పంచ్ డైలాగులతో రంజింపచేసాడు. శ్రీహరి, ప్రకాష్ రాజ్ సాధారణంగానే మెప్పించారు. ఇందులో ప్రియాంక చోప్రా అందాలు మరో ఆకర్షణ. ఏదైమైనా ఒక్క ట్రైలర్ తో ఈ సినిమా అంచనాలను అమాంతం పెంచేశారు.

తాజా వార్తలు