బాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ లలో యష్ రాజ్ ఫిల్మ్స్ తాలూకా యాక్షన్ స్పై యూనివర్స్ కూడా ఒకటి. అయితే పెద్దగా లాజిక్స్ కథతో పని లేకుండా సాగే ఈ యాక్షన్ స్పై సినిమాలపై అసలు సిసలు స్పై సెటైర్స్ వేసినట్టు బాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నటుడు మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో చేస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటిటిలో ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో మూడో సీజన్ ఇపుడు రాబోతుంది. మరి ఈ సీజన్ లేటెస్ట్ ట్రైలర్ లో తన కొడుకుతో ఓ డైలాగ్ ఇపుడు వై ఆర్ ఎఫ్ స్పై ఫ్రాంచైజ్ పైనే సెటైరికల్ గా ఉందనే టాక్ మొదలైంది.
తన కొడుకు మనోజ్ ని నీకు కూడా టైగర్, పాంథర్ లాంటి కోడ్ నేమ్ ఉందా అని అడిగితే నేను ఇంటెలిజెన్స్ లో పని చేస్తాను సర్కస్ లో కాదు అంటూ చెప్పే డైలాగ్, యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి వచ్చిన టైగర్, పఠాన్ లాంటి సెన్స్ లెస్ స్పై డ్రామాలపై సెటైర్స్ అంటూ బాలీవుడ్ జనమే అంటున్నారు. దీంతో ఈ క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
