ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస దగ్గర సందడి చేస్తున్న రెండు బడా చిత్రాలు కూలీ, వార్ 2 ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించడంతో ఈ సినిమాలో వారి పర్ఫార్మెన్స్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు.
మరోవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన స్పై సీక్వెల్ చిత్రం ‘వార్ 2’ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ వైల్డ్ యాక్షన్ డ్రామాకు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇక ఈ రెండు చిత్రాల ఓటీటీకి సంబంధించి ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ రెండు సినిమాలు కూడా 8 వారాల థియేట్రికల్ రన్ తర్వాతే ఓటీటీలోకి వస్తాయని తెలుస్తోంది. కాగా, వార్ 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్.. కూలీ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఈ చిత్రాలు ఓటీటీలకు ఎప్పుడు వస్తాయనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.