ఓటీటీ : సింగిల్ స్ట్రీమింగ్ డేట్ అదేనా ?

ఓటీటీ : సింగిల్ స్ట్రీమింగ్ డేట్ అదేనా ?

Published on May 21, 2025 1:00 AM IST

శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’ పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. నిజానికి రిలీజ్ కు ముందే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే, ఈ మూవీ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఐతే, తాజాగా సింగిల్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ ఫామ్ సొంతం చేసుకుంది.

కాగా ఈ క్రమంలో థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍ కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అంటే, జూన్ 6వ తేదీన లేదా జూన్ 12న సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు